బిగ్ బాస్ సీజన్ 4 నాలుగు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. నాలుగు వారాల్లో నలుగురు కంటెస్టంట్స్ ను వాళ్ళ ఇంటికి పంపించేసింది. మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కళ్యాణి, 3వ వారం దేవి నాగవల్లి, ఇక ఫైనల్ గా 4వ వారం స్వాతి దీక్షిత్ బయటకు వచ్చారు. వీరిలో దేవి స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకోగా ఆమె బయటకు వచ్చింది. కరాటే కళ్యాణి వెళ్తూ వెళ్తూ దేవిని డైరెక్ట్ నామినేట్ చేసింది. ఇక 4వ వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అందరికి షాక్ ఇచ్చింది.

కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హౌజ్ లో ఉన్నారు. అయితే ఇదివరకు సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన మొదటి నామినేషన్స్ వాళ్ళని వదిలేసేవారు కాని ఈసారి అలా జరుగలేదు. అయితే నాలుగు వారాలు ముగిసింది హౌజ్ లో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్.. ఎవరు తెలివిగా ఆడుతున్నారో అర్ధమైంది. దేవి, స్వాతిల కన్నా వీక్ గా ఉన్న కొందరు హౌజ్ లో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సుజాత. ఆమె టాస్కుల్లో జస్ట్ ఓకే అనిపిస్తుంది. దేవి కన్నా చాలా వీక్ కాని ఆమె నామినేషన్స్ లో లేకుండా తప్పించుకుంటుంది.  

ఒకవేళ ఆమె నామినేషన్స్ లోకి వస్తే మాత్రం ఆ వారమే హౌజ్ నుండి బయటకు రావడం పక్కా అని చెప్పొచ్చు. ఎప్పుడు లాస్యతో హౌజ్ లో వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడటం తప్ప సుజాత చేసేది ఏమి లేదు. హౌజ్ లో తెలివితో ఆడుతున్న ప్లేయర్ గా సుజాత పేరు చెప్పొచ్చు. అందుకే నామినేట్ అయిన వారంతా సుజాతది ఫేక్ నవ్వు అని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. సో అందరి కన్నా లక్ ఎక్కువ తోడవుతుంది కూడా ఆమెకే అని చెప్పొచ్చు. జోర్ దార్ సుజాత ఇలా మరి ఇంకెన్నాళ్ళు నామినేషన్స్ నుండి తప్పించుకుంటుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: