రాజకీయాలనుండి మళ్ళీ సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరస పెట్టి ఒప్పుంటున్న సినిమాల లిస్టులో ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా చేరిపోవడంతో ఈ మల్టీ స్టారర్ పై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న  ఈ రీమేక్ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభించి కేవలం రెండు నెలలలో షూట్టింగ్ పూర్తి చేసే విధంగా దర్శకుడు సాగర్ పక్క ప్లాన్ తో ఉన్నాడు.  


ఈ సినిమాకు సంబంధించి పవన్ కాల్షీట్స్  కేవలం 25 రోజులు మాత్రమే ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది.  వచ్చేఏడాది సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా రాబోతున్న ఈ మల్టీ స్టారర్ మూవీలో పవన్ పక్కన కోషీ పాత్రలో నటించే నటుడు కోసం అన్వేషణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈమూవీ తెలుగులో రీమేక్ చేస్తారు అని వార్తలు వచ్చినప్పుడు అనేకమంది హీరోలు ఈ రీమేక్ లో నటించడానికి ఆశక్తి కనపరిచారు.


ఈ సినిమాలో పవన్ నటిస్తున్నాడు అని వార్తలు రాగానే చాలామంది హీరోల ఉత్సాహం నీరుకారిపోయినట్లు టాక్. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. అయితే మళయాళ మాతృకలో కోషీ పాత్రను చేసిన పృధ్వీరాజ్ చేసిన పాత్ర వివిధ డైమెన్షన్లలో వుండే హీరో పాత్ర కాగా పవన్ కళ్యాణ్ చేస్తున్న బిజు మీనన్ క్యారెక్టర్ వన్ డైమెన్షనల్‌ గా మాత్రమే ఉంటుంది.  



ప్రస్తుతం తెలుగులో బిజు మీనన్ పాత్రను పవన్ ఎంచుకోవడంతో సీన్ మారిపోయింది అని అంటున్నారు. పవన్‌ తో తీస్తున్న ఈ మూవీలో మాతృక మలయాళ చిత్రాన్ని యథాతథంగా రీమేక్ చేసే పరిస్థితులు లేవు. పవన్ కళ్యాణ్ ఆ పాత్ర ఎంచుకున్నాడు కాబట్టి మరో క్యారెక్టర్‌ని వీక్ చేసేస్తారనే భయంతో పలువురు హీరోలు ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈ రీమేక్ ను తీయడం దర్శకుడు సాగర్ కు కత్తిమీద సాములా మారింది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: