తెలుగులో హీరోయిన్స్ కొరత వల్ల అందంగా ఉండి.. కొద్దిగా టాలెంట్ చూపించిన ప్రతి భామకు ఇక్కడ వరుస అవకాశాలు వస్తుంటాయి. మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకునే భామలు కొంతమంది ఉంటారు. అలా క్రేజ్ తెచ్చుకుని వారి టాలెంట్ చూపిస్తే ఇక వారికి స్టార్ ఇమేజ్ వచ్చేసినట్టే. లేటెస్ట్ గా అదే క్రేజ్ తెచ్చుకుంది కన్నడ భామ కృతి శెట్టి. తెలుగులో ఉప్పెన సినిమాతో అమ్మడు తెరంగేట్రం చేసింది.

ఈ సినిమాలో కృతి శెట్టి లుక్స్, యాక్టింగ్ అన్ని సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అంతేకాదు మొదటి సినిమానే అయినా కృతి శెట్టి బేబమ్మ పాత్రలో చూపించిన అభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏమాయ చేసావె సినిమా టైం లో సమంతని చూసి అందరు ఎలా ఫీల్ అయ్యారో ఉప్పెన చూసి కృతి శెట్టిని అలానే ఫీల్ అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు వరుస ఛాన్సులు వచ్చాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజై సూపర్ హిట్ అయ్యింది.

సో తెలుగులో హీరోయిన్ గా మరో స్ట్రాంగ్ కాంపిటీటర్ వచ్చిందని చెప్పొచ్చు. కృతి శెట్టికి ముందు ఉప్పెన సినిమాకు మనీషా రాజ్ ను తీసుకున్నారు. ఆమెను తీసుకుని ఉంటే సినిమాకు ఈ బజ్ వచ్చేది కాదు. కృతి శెట్టి లుక్స్ యువతకి నచ్చబట్టే సినిమాకు ఈ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కృతి శెట్టిని చూడగానే విజిల్స్ వేసేశారంటే అమ్మడి రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. ఉప్పెన తర్వాత నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టి. చూస్తుంటే అమ్మడు సమంత రేంజ్ దక్కించుకోడానికి పెద్దగా టైం కూడా తీసుకునేలా లేదని అనిపిస్తుంది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: