ఈ సినిమా విషయంలో సుకుమార్ చెప్పిన 100 కోట్ల టార్గెట్ కూడా రీచ్ అయ్యేలా ఉంది. ఇదిలాఉంటే సుకుమార్ మొదటిసారి లెక్క తప్పుతున్నాడా అనిపిస్తున్న ప్రాజెక్ట్ పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో సినిమా అంటే ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దట్టమైన మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ షిఫ్ట్ చేశారట. సినిమాలో మరో రెండు భారీ షెడ్యూల్స్ షూట్ చేయాల్సి ఉందట.
అది పూర్తి చేస్తే సినిమాకు ఎలాంటి అడ్డు లేదట. అయితే ఆ షెడ్యూళ్లను పూర్తి చేయకుండానే సుకుమార్ దర్శక నిర్మాతలు ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎలాగు ఐదు నెలలు టైం ఉంది కాబట్టి ఆలోగా ఈ షూటింగ్ పూర్తి చేయొచ్చని అనుకున్నా పుష్ప విషయంలో ఎక్కడో తేడా కొడుతుందని అంటున్నారు. సినిమా అనుకున్న డేట్ కు రాకుండా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది.