టాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా అనంతరం వరుస సినిమాలను విడుదల చేస్తూ సంతోషంగా ఉంది. కానీ కళామతల్లి సంతోషంగా ఉండడం కరోనాకు ఇష్టం లేదేమో మళ్ళీ తన హవాను భారీ స్థాయిలో చూపిస్తోంది. కరోనా ముందు ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు షూటింగులతో బిజీగా ఉన్నాయి. జనవరి నుండి విడుదలయిన అన్ని సినిమాలను ప్రేక్షకులు కారొనను సైతం లెక్క చేయకుండా ఆదరిస్తున్నారు. ఆ ధైర్యంతోనే నిర్మాతలు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక వారం రోజుల నుండి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

దీనితో షూటింగు చివరి దశలో ఉన్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. మళ్ళీ లాక్ డౌన్ పడుతుందా...? తరువాత పరిస్థితి ఏమిటి అని సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.  కాగా ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలంతా వారి వారి సినిమాల షూటింగులతో బిజీ గా ఉన్నారు. కరోనా ముంచుకొస్తున్న తరుణంలో ఎవరూ షూటింగులను ఆపే పరిస్థితి అయితే కనబడడం లేదు. కానీ ఒక్క టీం మాత్రం కరోనా వలన భయపడుతున్నట్లు సమాచారం. పరుశురాం దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కానీ ఒక కొన్ని సన్నివేశాల కోసం గోవా షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నట్లు తెలిసిందే. కానీ ఉత్తరాదిన కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం గోవా షెడ్యూల్ ను రద్దు చేసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది 25 రోజుల పాటు నిర్విరామంగా జరగనుందని సమాచారం. అయితే కరోనా ప్రభావం చిత్ర బృందం లోకి ఎవరికీ రాకుండా ఉండడానికి కఠినమైన నిబంధనలను పాటిస్తున్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: