ఐకాన్ పై వేణు శ్రీరామ్ వేదాంతం !

Seetha Sailaja
‘వకీల్ సాబ్’ మూవీ మ్యానియాతో వేణు శ్రీరామ్ పేరు కూడ ఇండస్ట్రీలో మారుమ్రోగి పోతోంది. ఈ మూవీ సాధించే రికార్డులను బట్టి వేణు శ్రీరామ్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ తో ఒక బ్లాక్ బష్టర్ మూవీని తీసినప్పటికీ ఆమూవీ దర్శకుడుకి వెంటనే భారీ అవకాశాలు ఇవ్వడం చాల అరుదుగా జరుగుతూ ఉంటుంది.

గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ తీసిన తరువాత కూడ ఇంకా హరీష్ శంకర్ క్రేజీ డైరెక్టర్ గా సెటిల్ కాలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో వేణు శ్రీరామ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ అప్పుడే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు మొదలైపోయాయి.

ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో తీయవలసిన ‘ఐకాన్’ మూవీ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. వాస్తవానికి ‘వకీల్ సాబ్’ మూవీ ప్రారంభం కాకముందే ‘ఐకాన్’ మూవీ ప్రకటన విడుదలైంది. మోటార్ సైకిల్ దొంగతనం చుట్టూ తిరిగే ఒక యాక్షన్ స్టోరీతో ‘ఐకాన్’ కథను అల్లారు. ఈకథ బన్నీకి కూడ అప్పట్లో బాగా నచ్చింది అని అంటారు.

అయితే అనూహ్యంగా బన్నీ మనసు మార్చుకుని ఈమూవీని పక్కకు పెట్టి సుకుమార్ తో ‘పుష్ప’ వైపు వెళ్ళిపోవడంతో ‘ఐకాన్’ అటకెక్కింది. ఇప్పడు ఈమూవీ గురించి వేణు శ్రీరామ్ వేదాంత ధోరణిలో స్పందించాడు. ఈమూవీ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తనకు కూడ తెలియదని కేవలం భగవంతుడుకు మాత్రమే తెలియాలి అంటూ జోక్ చేసాడు. అంతేకాదు ‘వకీల్ సాబ్’ విజయం తరువాత మాత్రమే తన భవిష్యత్ సినిమాల గురించి ఆలోచనలు చేస్తానని ఇప్పుడు తన దృష్టి అంతా ‘వకీల్ సాబ్’ పైనే ఉంది అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనితో ఈ దర్శకుడు   బన్నితో  తీయవలసిన ‘ఐకాన్’ ఇక శాస్వితంగా ఆగిపోయినట్లే అనుకోవాలా అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ మొదలైపోవడంతో వేణు శ్రీరామ్ వేదాంతం పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: