టాలీవుడ్ లో బావ బామ్మర్థులు వీళ్ళే..!
ముందుగా ఈ లిస్ట్ లో ఉండే వాళ్లలో మహేష్ బాబు,సుధీర్ బాబు అని చెప్పవచ్చు.వీరిద్దరూ బావ బామ్మర్దులు.మహేష్ బాబు చెల్లెలు అయిన ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా.సుదీర్ కూడా మహేష్ బాబు బాటలో కాకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ హీరోగా దూసుకుపోతున్నాడు.అలాగే బాలీవుడ్‌లో విలన్‌గా కూడా సత్తా చూపెట్టారు సుధీర్ బాబు. ఇపుడు పలు తెలుగుతో పాటు హిందీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు సుధీర్ బాబు.అలాగే మన మెగా ఫ్యామిలీలో కూడా బావ బామ్మర్దులు చాలా మందినే ఉన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ చెల్లెలు అయిన సురేఖను వివాహాం చేసుకున్నారు. అలా అల్లు అరవింద్, చిరంజీవి బావ బామ్మర్దులుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.ఇకపోతే మనం అక్కినేని ఫ్యామిలీ ఎమన్నా తక్కువా చెప్పండి. ఏకంగా దగ్గుబాటి ఫ్యామిలీతోనే రిలేషన్ పెట్టుకుంది. అక్కినేని నాగార్జున మన విక్టరీ వెంకటెష్ చెల్లెలు లక్ష్మిని మొదటి వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అలా నాగార్జున, లక్ష్మిలకు పుట్టిన కుమారుడే మనం హీరో నాగ చైతన్య.అలా వెంకటేష్, నాగార్జున బావ బామ్మర్దులు అయ్యారు. అలానే వరసకు అల్లు అర్జున్ - రామ్ చరణ్ వరుసకు బావ బామ్మర్థులు అవుతారు. ఇప్పుడు మెగా అల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో రాణిస్తున్నాడు. వరసకు రామ్ చరణ్ - కళ్యాణ్ దేవ్ ఇద్దరు బావ బామ్మర్థులు. అలాగే మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ల మధ్య బావ బామ్మర్ధుల సంబంధం ఉంది.
ఇకపోతే నందమూరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు నారా రోహిత్ వరుసకు బావ అవుతాడు.అలాగే అక్కినేని నాగ చైతన్య, అఖిల్ సోదరులకు హీరో సుశాంత్ వరుసకు మేనబావ అవుతాడు.అలాగే నాగ చైతన్య, అఖిల్ సోదరులకు సుమంత్ కూడా మేనబావ అవుతాడు.నాగ చైతన్య - రానా దగ్గుబాటి కూడా వరుసకు బావ బామ్మర్థులు అవుతారు. రామ్ పోతినేని అక్కయ్యను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరు వరుసకు బావ బామ్మర్థులు అవుతారు. అలాగే మన గాంధ గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పీ శైలజను శుభలేఖ సుధాకర్ పెళ్లి చేసుకున్నారు. వరసకు వీళ్లిద్దరు బావ బామ్మర్థులు అవుతారు. నందమూరి నట సింహం బాలకృష్ణకు దగ్గుబాటి వెంకటేశ్వరావు, చంద్రబాబు నాయుడుకు బామ్మర్ధి అవుతాడు.