ఊహని మొదట చూసి అలా అనుకున్న శ్రీకాంత్.. ప్రేమించి ఎలా పెళ్లాడాడు..!

shami
టాలీవుడ్ హీరో హీరోయిన్ ల సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీల గురించి మాట్లాడుకుంటే అందులో శ్రీకాంత్, ఊహల గురించి ప్రస్థావించాల్సిందే. శ్రీకంత్, ఊహ కలిసి నటిస్తూ అభిప్రాయాలు కలిసి ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే కన్నడ, మళయాళ, తమిళ సినిమాలు చేసిన ఊహ తెలుగులో ఆమె సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు.
లేడీ ఓరియెంటెడ్ కథ అని చెప్పి శ్రీకాంత్ ను ఒప్పించిన దర్శకుడు ఏ రమ్యకృష్ణనో పెడతారని భావించాడట.తీరా చూస్తే కొద్దిగా బొద్దుగా ఉన్న ఊహని తెచ్చి ఈమే హీరోయిన్ అనేశారట. ఆ టైం లో ఊహని చూసి ఈమే ఏంటి ఇలా ఉందని అనుకున్నారట శ్రీకాంత్. కాని తర్వాత తర్వాత అభిప్రాయాలు కలిసి ఆమెనే ప్రేమించి పెళ్లాడారు. శ్రీకాంత్, ఊహలు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలిచాయి.
మ్యారేజ్ తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. వీరిద్దరికి ముద్దులు పిల్లలు ఉన్నారు. ఈమధ్యనే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆల్రెడీ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో రోషన్ నటించాడు. త్వరలో పెళ్లిసందడి తో రాబోతున్నాడు. శ్రీకాంత్ కెరియర్ లో పెళ్లిసందడి సూపర్ సక్సెస్ కాగా మళ్లీ అదే టైటిల్ తో రోషన్ వస్తున్నాడు. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమాతో రోషన్ ని హీరోగా నిలబెట్టాలని చూస్తున్నాడు శ్రీకాంత్. రోషన్ కాకుండా శ్రీకాంత్ ఊహలకు మరో పాప, బాబు ఉన్నారు. శ్రీకాంత్ పాప క్లాసికల్ డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తుంది. హీరోగా తన కెరియర్ దాదాపు ముగిసిందని భావిస్తున్న శ్రీకాంత్ స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. విలన్ గా కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలకృష్ణ అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారని తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: