ఓటీటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నిర్మాత...?
ఈ మేరకు ఎవరికి ఏ మాత్రం ఛాన్స్ దొరికినా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులు మూవీలు చూడాలన్న ప్రమోషన్ చేస్తున్నారనే చెప్పాలి. కాగా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం లో మూవీలు చస్తున్న ప్రేక్షకులకు థియేటర్లలో భారీ స్క్రీన్ మీద చూస్తే వచ్చే ఫీల్ రావట్లేదనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో సీనియర్ ప్రొడ్యూసర్ అయిన మంచి ఇమేజ్ ఉన్న ఎన్వీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు తమ బ్యానర్ లో తీసిన 93వ మూవీ ఇష్క్.
ఇప్పుడు ఈ మూవీకి థియేటర్లు రీఓపెన్ అయిన ఫస్ట్ రోజునే థియేటర్లలో మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలని తామ తమ టీమ్ కూడా ముందు నుంచి అనుకుంటున్నామని ఆయన వివరించారు. ఇక ఇప్పుడు కరోనా తగ్గాక 30 నుంచి మూవీ థియేటర్లు రీఓపెన్ అవుతున్న సమయంలో వాస్తవంగా థియేటర్ లో బిగ్ స్క్రీన్‌పై చూసే సినిమాకు అలాగే ఓటీటీ ఫ్లాట్ ఫాం పై చూసే మూవీలోని ఫీల్ కు మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరంగా చెప్పారు.
ఇక మరో అడుగు ముందుకేసి ఓటీటీ ఫ్లాట్ ఫాం వారు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును ఎంతో క్లియర్‌గా వివరించే ప్రయత్నం చేశారు ఆయన. అందుకే తమ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నామని ఆయన వివరించారు. ఇక ఓటీటీ అనే ఆలోచనే అస్సలు తమకు రాలేదన్నారు. ప్రస్తుతం గతానికి భిన్నంగా ఓటీటీ రూల్స్ చాలా వరకు మారిపోయాయన్నారు. వాస్తవానికి చిన్న మూవీలకు వచ్చేసరికి పది మందికి కంటెంట్ ఇచ్చిన తర్వాతే నచ్చితే నిర్ణయం ఉంటుందని ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన.