సినిమా కథ దక్షిణాది ప్రేక్షకులను మెప్పిస్తుందని అందుకే శ్యాం సింగ రాయ్ సినిమాను సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. కలకత్త బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినీమ హిందీ లో రిలీజ్ అవ్వట్లేదు. శ్యాం సింగ రాయ్ మాత్రమే కాదు ఇక మీదట తన ప్రతి సినీమ సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా చూస్తానని అన్నారు నాని. రాజమొళి ఈగ సినిమా తనని సౌత్ ఆడియెన్స్ దగ్గరకు చేరవేసిందని. తప్పకుండా ఇక మీదట అన్ని సినిమాలు సౌత్ మొత్తం రిలీజ్ అయ్యేలా చేస్తానని అన్నారు నాని.
అయితే పాన్ ఇండియా కథ వస్తే మాత్రం హిందీలో కూడా రిలీజ్ చేస్తామని అన్నారు. అంతేకాదు ఒకసారి పాన్ ఇండియా ఆఫర్ వచ్చినా వదుకున్నానని అన్నారు. శ్యాం సింగ రాయ్ మాత్రమే కాదు తర్వాత వివేక్ ఆత్రేయ డైరక్సహ్న్ లో వస్తున్న అంటే సుందరానికీ.. దసరా సినిమాలు కూడా సౌత్ అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని ప్రకటించారు నాని. చిన్నగా నాని కొడా ఏదోలా ముందు సౌత్ మొత్తం ట్రై చేసి బాలీవుడ్ కూడా వెళ్లాలని ప్లాన్ లో ఉన్నాడు. తప్పకుండా నాని అనుకునేలా తన సినిమాలన్ని వరుస సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.