బుల్లితెరపై తమ సత్తా చాటిన అతి కొద్దిమంది మేల్ యాంకర్ లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. టెలివిజన్ షోలలో హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ యాంకర్ కి హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తన డైన మార్క్ ను క్రియేట్ చేసారు ఈ హీరో. హీరోగా మారక ముందు వరకు కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా ఒక్కో అడుగు ఎక్కుతూ వచ్చాడు. అలా వచ్చిన అనుభవంతో "ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యి మొదటి సినిమాతోనే మంచి మార్కులే తెచ్చుకున్నాడు.
 
గత ఏడాది జనవరి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ కలెక్షనలు మాత్రం బాగానే రాబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇపుడు ప్రదీప్ మరో సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రదీప్. అయితే ఈ సినిమాకి త్వరలోనే ముహూర్తం ఖరారు కానుందని వినికిడి. అంతేకాదు ఈ సినిమాకి తొలి క్లాప్ ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ ఏమిటి ? హీరోయిన్ ఎవరు ? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

బుల్లి తెరపై తనదైన పంచ్‌లు, యాంకరింగ్‌తో అలరించే ఈ యంగ్ యాంకర్ "అత్తా కోడళ్ళు" షోతో ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశాడు. తన టాలెంట్ తో నేడు ఈ స్థాయిలో మనముందు నిలిచారు ప్రదీప్.  సుమ కనకాల తరువాత టాలీవుడ్‌లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తిగా ప్రదీప్‌ కు ఫాలోయింగ్ ఉంది. అయితే హీరోగానూ ఒక స్థాయిలో నిలబడగలడా అన్నది తెలియాలంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: