గత కొంతకాలం నుండి సినిమా పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు తనువు చాలించారు. ముఖ్యంగా సంగీత విభాగానికి చెందిన వారే ఎక్కువగా మరణిస్తూ ఉండడం మరింత బాధాకరం. వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, లతా మంగేష్కర్, బప్పి లహరి, సంధ్య ముఖర్జీ, మాణిక్యం వినాయగం లాంటి ఎందరో ప్రముఖులు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. వీరంతా కూడా తమ యొక్క కెరీర్ లో అభిమానులను సంతోషపెట్టి ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ చేదు వార్తల నుండి తేరుకోకముందే మరో విషాదం సంగీత ప్రపంచాన్ని దుఃఖసంద్రంలో ముంచేసింది.
ఈ రోజు కాసేపటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్ రావు చెన్నైలో ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మన అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఈశ్వర్ రావు ఈ రోజు కన్ను మూశారు. ప్రస్తుతం అతని వయసు 69 సంవత్సరాలు. ఈయన ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఎస్పీ కోదండపాణికి కుమారుడు. ఈశ్వర్ రావు తెలుగు మరియు తమిళ్ లో చాలా సినిమాలకు సంగీతం అందించారు. అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు మ్యూజిక్ సహకారం అందించారు.
ఈశ్వర్ రావు సినిమాలకు మాత్రమే కాకుండా సీరియల్ లకు కూడా సంగీతం అందించి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈయన సంగీతం అందించిన సీరియల్ లో అంతఃపురం, శుభలేఖ మరియు జీవితం లాంటివి ఉన్నాయి. ఈశ్వర్ రావు రెండు రాష్ట్రాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇతనితో కలిసి పని చేసిన ప్రముఖులు అంతా ఈయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ రోజు టాలీవుడ్ లో మరొక విషాదం కూడా చోటు చేసుకుంది. ప్రముఖ పాటల రచయిత కందికొండ ఈ రోజు క్యాన్సర్ వ్యాధి కారణంగా మృతి చెందారు.