బాలీవుడ్ లో ఉన్న హీరో 'ఖాన్' త్రయం లో అత్యంత ఆదరణ కలిగిన హీరో సల్మాన్ ఖాన్ అని చెప్పాలి. గత మూడు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పటికీ తనకు వివాహం కాకపోవడం ఒక్కటే తన అభిమానులకు విచారాన్ని కలిగించే విషయం. అయితే సల్మాన్ ఖాన్ గతంలో చాలా ప్రేమాయణాలు నడిపాడని కానీ ఏవీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదని తెలిసిందే. అయితే తాజాగా సల్మాన్ ప్రేమించిన వారిలో ఒకరు తన గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. హీరోయిన్ గా అడపా దడపా సినిమాలు చేసిన సోమీ అలీ అప్పట్లో సల్మాన్ తో లవ్ లో ఉంది. అలా దాదాపు పదేళ్ల పాటు ప్రేమలోనే ఉన్న వీరిద్దరూ ఏవో మనస్పర్థలు రావడంతో బ్రేక్ అప్ చెప్పుకున్నారు.

ఆ తర్వాత సోమీ అలీ సినిమాలను వదిలేసి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. అయితే ఈమె అవకాశం వచ్చినప్పుడల్లా తన మాజీ లవర్ ను విమర్శిస్తూనే ఉంది. అయితే ఈ సారి తాను చేసిన వ్యాఖ్యలు సల్మాన్ ప్రతిష్టను దిగజార్చేలా ఉండడం గమనార్హం. మాములుగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాల మందితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్నేహితులు అదే విధంగా శత్రువులు కూడా ఏర్పడడం సహజమే. ఇక ప్రేమాయణాలు నడిపిన సల్మాన్ కు సహజంగానే కోపం కొంచెం ఎక్కువని అందరికీ తెలుసు. అయితే ఏదో కొందరి హీరోయిన్ లతో గొడవలు పడిన మాట వాస్తవం. అయితే సోమీ అలీ చెబుతున్న ప్రకారం సల్మాన్ ఖాన్ అమ్మాయిలను కొట్టేవాడని చెప్పింది.

ఇందులో సోమీ అలీ కూడా తన దగ్గర దెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సల్మాన్ ను శాడిస్ట్ అని తిట్టడం కూడా సంచలనం అవుతోంది. అయితే ఈ కామెంట్స్ పై సల్మాన్ ఖాన్ ఇంకా ఏమీ స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: