కానీ రిలీజ్ రోజున రివ్యూలు మరియు ప్రేక్షకుల స్పందన అయితే సినిమాపై అంతగా ఆశలు కలిగించలేదు. కథలో కొత్తదనం లేకపోవడం మరియు స్క్రీన్ ప్లే లోపాలు ఉండడంతో ఈ సినిమా చాలా కాలం థియేటర్ లలో ఉండడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే వీకెండ్ లో వచ్చిన కలెక్షన్ లను ఆధారంగా చేసుకుని, ఇపుడే ఇలా వస్తే వీక్ డేస్ లో ఎలా రాణిస్తుంది అని అంతా అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకు మొత్తం 32 కోట్ల వసూళ్లను అందుకుంది . కథతో సంబంధం లేకుండా పెద్దగా సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఆ మాత్రం కలెక్షన్ లను అందుకుంది.
ఇక ఈ రోజు కూడా ఫ్రీ బుకింగ్స్ బాగానే జరిగాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ మాస్ నటన , శ్రీలీల గ్లామర్ మరియు సాంగ్స్ సినిమా విజయానికి ప్లస్ అయ్యాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఈవారం మంచి కలెక్షన్ లను సాధించే అవకాశం ఉంది.