
ప్రస్తుతం ఈమె చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉండడం గమనార్హం. అందులో అన్నీ కూడా పెద్దపెద్ద హీరోల సినిమాలే కావడం గమనించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న #SSMB 28 లో పూజా హెగ్డే తో పాటు సెకండ్ హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకున్న శ్రీ లీలా మరోవైపు బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా బాలకృష్ణకు కూతురు పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా శ్రీ లీలా క్రేజ్ కారణంగా మిగతా స్టార్ హీరోయిన్లు కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న శ్రీ లీలా పారితోషకం కూడా పెద్దగా డిమాండ్ చేయడం లేదు. అందుకే ఈమె క్రేజ్ ను బట్టి అలాగే పెద్దగా పారితోషకం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నిర్మాతలు ఎక్కువగా ఈమెను సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలోని మిగతా స్టార్ హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో పెంచకుండా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా శ్రీ లీలా క్రేజ్ మిగతా హీరోయిన్లకు ఇబ్బందిని కలిగిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.