సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్త ప్రపంచం లోకి తీసుకెళ్లినట్టు అనిపించింది ఆది పురుష్ ట్రైలర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ లో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందో అని ఫ్యాన్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం , మలయాళం ఇంకా కన్నడ బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నేడు కాసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ఊహించినదానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా ఆదిపురుష్ తెలుగు ట్రైలర్ కంటే కూడా, హిందీ ట్రైలర్ కి అయితే సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.
నార్త్ ఇండియన్స్ లో శ్రీ రాముడు అంటే ఎంత భక్తి భావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక రామాయణం ని సరికొత్త టెక్నాలజీతో చాలా అద్భుతంగా చూపిస్తే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అనడానికి ఉదాహరణ, ఈరోజు విడుదలైన ఆది పురుష్ ట్రైలర్. ఇకపోతే శ్రీ రాముడి చరిత్రని ఇంత వైభోగంగా చూపిస్తున్నందుకు, ఈ సినిమాకి కేంద్ర ప్రభుత్వం నుండి ఫుల్ సపోర్టు ఉందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాకి పన్ను మినహాయింపు చేయబోతోందని తెలుస్తుంది, అదే కనుక జరిగితే ఈ సినిమా బాహుబలి 2 ఫుల్ రన్ గ్రాస్ ని చాలా సింపుల్ గా క్రాస్ చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.బాహుబలి సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నీ భాషల్లో కలిపి దాదాపు 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆదిపురుష్ సినిమాకి పన్ను మినహాయింపు కారణంగా బాహుబలి కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు మేకర్స్.మరి అది నిజం అవుతుందో లేదో తెలియాలంటే ఇంకా నెలరోజులు ఆగాల్సిందే.