కన్నడ నుంచి వచ్చిన కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బీభత్సం సృష్టించింది. ఈ సినిమా దర్శకుడు హీరో రిషబ్ శెట్టి కూడా సినిమా ఈ రేంజ్ సక్సెస్ అందుకుంటుందని ఊహించలేదు. కాంతార సినిమాను 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఫైనల్ రన్ లో 400 కోట్ల దాకా రాబట్టింది. కాంతార సూపర్ హిట్ అవడంతో కాంతార 2 అనౌన్స్ చేశాడు రిషబ్ శెట్టి. అయితే కాంతారా 2 మాత్రం గ్రాండియర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. కాంతార 2 విషయంలో మేకర్స్ చాలా పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నారు.

కాంతార 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా సినిమాను ఆగష్టు నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారట. కాంతార 2 సినిమాను ఈసారి అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి కొన్ని వర్క్ షాప్స్ ఏర్పాటు చేశారట. దాదాపు అది ముగింపు దశకు వచ్చిందట. ఇక ఆగష్టు నుంచి సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్తుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ నిర్మించిన హోంబలె నిర్మాతలే కాంతార సినిమాను నిర్మించారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు కాంతార ఫస్ట్ పార్ట్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది కాబట్టి ఈ సీక్వల్ లో ఇతర భాషల హీరోలని కూడా భాగం చేయాలని చూస్తున్నారట. సో అలా అయితే సినిమాకు మరింత కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. తప్పకుండా కాంతార 2 అనుకున్న దాని కన్నా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. రిషబ్ శెట్టి మేకింగ్ మీద కూడా సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారని అర్ధమవుతుంది. సో కాంతారా 2 ఆడియన్స్ కి మరో సూపర్ ఎక్స్ పీరియన్స్ మూవీగా ఉండబోతుందని ఫిక్స్ అవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: