యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ స్టోరీలని రాబోయే రోజుల్లో చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. raw ఎజెంట్స్ తో కూడిన ఈ యూనివర్స్ ను మొదట స్టార్ట్ చేసిన సినిమా మాత్రం ఏక్తా టైగర్.ఆ తర్వాత వచ్చిన టైగర్ జిందా హై కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒక స్పైగా సల్మాన్ ఖాన్ తన పాత్రతో బాక్సాఫీస్ వద్ద బంపర్ రికార్డులను బ్లాస్ట్ చేశాడు.అయితే ఇప్పుడు ఈ రెండు కథలకు కొనసాగింపుగా మరో కొత్త కథ కూడా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే టైగర్ 3. ట్రైలర్ను ఈరోజు గ్రాండ్ గా విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇక అందులో భాగంగా తెలుగులో కూడా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అయిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ ఎప్పటిలానే తన యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేశాడు. 


సినిమా మొత్తం కూడా వేరే ప్రపంచంలోకి తీసుకు వెళ్లే విధంగా ఉండబోతున్నట్లు చూస్తుంటే తెలుస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ బొమ్మ ఇది.ఇక ఈసారి శత్రువుల నుంచి దేశాన్ని రక్షించుకోవడమే కాకుండా టైగర్ తన కుటుంబాన్ని కూడా ఎలా రక్షించుకున్నాడు అనే పాయింట్ సినిమాలో ఎలివేట్ కాబోతోంది. సల్మాన్ ఖాన్ కి జోడిగా కత్రినా కైఫ్ నటించింది. అలాగే మరో క్రేజీ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు.ఈ సినిమాతో ఈసారి టైగర్ కథను మరింత డ్రామాగా వీక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు దర్శకుడు మనీష్ శర్మ. ఈ సినిమా కూడా ఖచ్చితంగా షారుఖ్ కి పఠాన్ లాగే సల్మాన్ కి 1000 కోట్లు తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలని మరింత పెంచింది. బాక్సాఫీస్ వద్ద నవంబర్ 12 నుంచి టైగర్ సల్మాన్ దాడి చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు బ్లాస్ట్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: