సాధారణంగా అయితే సామాన్యులు ఏం తింటారు. పప్పు ఆవకాయ లేదా చికెన్ మటన్ లాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇక సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా విదేశీ ఆహారాలను ఇష్టపడుతూ ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నాగచైతన్య మాత్రం వేలకోట్ల ఆస్తులు ఉన్న తెలుగు వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడట ఇక ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య ఒప్పుకున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలో తాండేల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేస్తూనే తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇక తన ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు నాగచైతన్య. నాగచైతన్య ఫేవరెట్ ఫుడ్ అనగానే నూడుల్స్, పిజ్జా, బర్గర్ లాంటివి అనుకుంటారు అందరు. కానీ అచ్చ తెలుగు వంటలే ఈ అక్కినేని హీరోకి ఇష్టమట వైట్ రైస్ ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి పెట్టుకుని తినడం ఆయనకు ఎంతో ఇష్టమట. అంతేకాదు ఈ కాంబినేషన్లో పచ్చిపులుసు కలుపుకుని తింటే ఉంటుంది నా సామిరంగా అంటూ నాగచైతన్య తన ఆహారపు అలవాట్లు గురించి చెప్పుకొచ్చాడు. మటన్ కానీ రొయ్యల ఫ్రై కాని సైడ్ డిష్ గా తింటుంటే ఇక ఈ లైఫ్ కి ఏం కావాలి అంటూ నాగచైతన్య చెప్పడం గమనార్హం.