కోహ్లీ నాకు బావ అవుతాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?
మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను అందుకొని జట్టును ఎన్నో ఏళ్ల పాటు సారధిగా ముందుకు నడిపించి అద్వితీయమైన విజయం కూడా అందించాడు. ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో స్టార్ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కోహ్లీ గురించి ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన కూడా అది ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఏకంగా తనకు బావ అవుతాడు అంటూ బాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తనకు బావ అవుతాడని హీరోయిన్ రుహాని శర్మ తెలిపారు. అనుష్క శర్మ నాకు సోదరి అవుతుంది. ఆమె భర్త విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు. కోహ్లీ నాతో చాలా బాగుంటాడు. వారిద్దరూ స్టార్స్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. వారిద్దరిలో నాకు నచ్చేది కూడా అదే. అయితే వీరిద్దరూ నా బంధువులనీ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అంటూ రూహణి శర్మ చెప్పుకొచ్చింది. కాగా ఈ హీరోయిన్ సైంధవ్, హిట్, డర్టీ హరి, చి లా సౌ సినిమాల్లో నటించింది.