ఇప్పుడంటే ఆధ్యాత్మిక సినిమాలు వస్తున్నాయంటే.. వాటిని చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. కానీ ఒకప్పుడు ఆధ్యాత్మిక సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు బారులు తీరుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఆ సినిమాల్లోని భక్తి భావాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా ఏకంగా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు కృష్ణుడు, రాముడు, కర్ణుడు లాంటి ఆధ్యాత్మిక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత కాలంలో ఏకంగా రాముడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న నటుడు సుమన్. నాగార్జున హీరోగా నటించిన శ్రీరామదాసు సినిమాలో సాక్షాత్తు ఆ తిరుమలేశుడి పాత్రలో నటించారు సుమన్. ఇక ఇందులో సుమన్ ను చూస్తున్నంత సేపు సాక్షాత్తు దేవుడే వచ్చి ముంగిట ప్రత్యక్షమయ్యాడేమో అనే భావన ప్రేక్షకులకు కలుగుతూ ఉంటుంది. ఇలా శ్రీమహావిష్ణువు పాత్రలో తన నటనతో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి.


 అయితే ఇలా శ్రీరామదాసు సినిమాలో ఆ పాత్ర వేసుకోవడానికి ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు అన్న విషయాన్ని ఆలీతో సరదాగా అనే షోలో చెప్పుకొచ్చారు. సుమన్ ఆ గెటప్ కు దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. తెల్లవారుజామున 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళిపోతే 9 గంటలకు పూర్తయ్యేది. కిరీటం పెట్టేశాక మళ్ళీ అది 12 గంటల వరకు తీసే వాడిని కాదు. అలా ఎనిమిది నెలలపాటు ఇక సినిమా కోసం కష్టపడ్డాను అంటూ సుమన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇంత కష్టపడి మేకప్ వేసి అన్ని కాస్ట్యూమ్స్ ధరింప చేశారు కాబట్టే.. ఆ పాత్ర అంత ఫేమస్ అయ్యింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: