కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కంగువ. శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే కంగువ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుండగా అక్టోబర్ 10 దసరా బరిలో ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ సూర్య ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది.

సూర్య కంగువ సినిమాలో తమ్ముడు కార్తీ కూడా ఒక ఇంపార్టెంట్ క్యామియోలో కనిపిస్తున్నాడట. అన్న సినిమాలో తమ్ముడు కనిపిస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. కంగువ సినిమా విషయంలో సూపర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అందుకే సినిమా కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. సినిమాలో కార్తీని కూడా తీసుకోవడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తుంది.

సూర్య తర్వాత ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన కార్తీ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో కూడా కార్తీకి మంచి పాపులారిటీ ఉంది. సూర్య, కార్తీ కలిసి నటించే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే కార్తీ కూడా కంగువలో భాగం అవ్వడం ఆ హీరోల ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది. కంగువ సినిమా పీరియాడికల్ కథతో రాబోతుంది.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. కంగువ సినిమా కోసం సూర్య చాలా రిస్కీ ఫైట్స్ చేశారు. కచ్చితంగా కోలీవుడ్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా కంగువ ఉంటుందని అంటున్నారు. ఈమధ్యనే ప్రభాస్ కల్కి సినిమాలో అలా మెరిసిన దిశా పటాని కంగువ తో కూడా సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ సినిమాతో అమ్మడు ఇక మీదట సౌత్ సినిమాల్లో కూడా కొనసాగించేలా క్రేజ్ తెచ్చుకుంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: