టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అ!, కల్కి (2019), జాంబీ రెడ్డి, హనుమాన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. దర్శకుడు తీసే ప్రతి సినిమా కూడా చాలా కొత్తగా ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా ఉంటుంది. అందుకే ఇతనికి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ దర్శకుడు ఫేమస్ అయ్యాడు. శనివారం జరిగిన "సరిపోదా శనివారం" ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. సమయంలో హనుమాన్ సినిమాలో ఒక తమిళ హీరోని తీసుకోవడానికి ప్రయత్నించామని కానీ నేను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చే స్థోమత తమ మూవీ టీమ్‌కి లేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత్ మాట్లాడుతూ ఆ తమిళ స్టార్ హీరో మరెవరో కాదు ఎస్‌జె సూర్య అని చెప్పారు. ఎస్‌జె సూర్య హీరోగా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్ గా కూడా విలక్షణ నాటన చూపించి అదరగొట్టారు. సరిపోదా శనివారంలో విలన్‌గా నటిస్తున్నారు ఎస్‌జె సూర్య.  R.దయానంద్ ఐపీఎస్ గా ఆయన కనిపిస్తారు. అయితే హనుమాన్ సినిమాలో ఆయనకు తమ మూవీ టీం కి మధ్య జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.

"మేం హనుమాన్‌లో విలన్ పాత్ర కోసం SJ సూర్యని ముందుగా సెలెక్ట్ చేసుకుందాం, కానీ ఎక్కువ శాలరీ అడిగారు. అంత మేము భరించలేక తీసుకోలేదు, అందుకే అతను ఈ చిత్రంలో భాగం కాలేదు," అని ప్రశాంత్ చెప్పారు. ఈ మాట చెప్పిన తర్వాత SJ సూర్య కూడా సరే అయితే అని క్యాజువల్ గా చెప్పారట. ఆ తర్వాత ఈ సినిమాలో విలన్ రోల్ కోసం వినయ్ రాయ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అతను బాగానే నటించి మెప్పించారు. ఇప్పుడు హనుమాన్ పెద్ద హిట్ అయినందున, ప్రశాంత్ కనీసం ఈ సినిమా రెండవ పార్ట్ జై హనుమాన్ కోసమైనా సూర్యని భరించగలుగుతారు లేదో చూడాలి. అయితే ఈ సంగతి తెలుసుకున్న చాలామంది మరీ ఇంత కక్కుర్తి ఎందుకు మంచి సినిమా వచ్చినప్పుడు నటించవచ్చు కదా అని ఎస్‌జె సూర్యని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ఆయన వీళ్ళకు డేట్స్ ఇచ్చే ఎందుకు తక్కువ శాలరీతో సరిపెట్టుకోవాలి అని అందిస్తున్నారు మొత్తం మీద ఈ వ్యవహారం కొద్దిగా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: