విజయ్ సేతుపతి కొన్ని రోజుల క్రితం మహారాజా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇక ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ అయింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి ..? ఈ మూవీ.కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.18 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో ఒక కోటి , ఆంధ్ర ఏరియాలో 2.27 కోట్ల కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.45 కోట్ల షేర్ , 13.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ ముగిసే సరికి 2.96 కోట్ల లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: