వేణు స్వామి పై సంచలన విషయాలు బయటపెడుతూ ఇప్పటికే వేణు స్వామి చేసే పూజలన్నీ అవాస్తవమని అందరికీ చాటి చెబుతూ టీవీ పై జర్నలిస్టు మూర్తి ఎంత పెద్ద రచ్చ సృష్టిస్తున్నారో చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్ గా ఈ గొడవ మొదలైంది ఒక ఆడియో రికార్డు బయటపడ్డాక.ఆ ఆడియో రికార్డులో ఓ అమ్మాయి అమర్ అంటే జర్నలిస్టు మూర్తి అనుచరుడని చెప్పుకొని వేణు స్వామి ఫ్యామిలీని 5 కోట్ల డిమాండ్ చేసినట్టు మాట్లాడుకున్న ఆడియో వైరల్ అయింది.అయితే ఈ ఆడియో వైరల్ అయ్యాక చావే మాకు శరణ్యం అంటూ వేణు స్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ విషయంపై టీవీ5 మూర్తి ఫైర్ అయ్యారు. అంతేకాదు త్వరలోనే ఈ ఫోన్లో మాట్లాడింది ఎవరో నేను బయట పెడతాను అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ విషయం బయట పెట్టారు. ఆ ఆడియో కాల్ రికార్డులో వినిపిస్తున్న ఆ అమ్మాయి గొంతు ఎవరిదో కాదు వేణు స్వామితో చాలా సన్నిహితంగా ఉండే కీర్తి రెడ్డి అంటూ పెద్ద బాంబు పేల్చారు  మూర్తి.. ఆయన మాట్లాడుతూ.. కీర్తి రెడ్డికి వేణు స్వామి దంపతులు చాలా దగ్గర..

 కీర్తి రెడ్డి అలియాస్ కీర్తి విజయేందర్ అలియాస్ మేఘన రెడ్డి.. వేణు స్వామికి కీర్తి రెడ్డి చాలా సన్నిహితురాలు.  వేణు స్వామి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కీర్తి రెడ్డి,కీర్తి రెడ్డి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు వేణు స్వామి దంపతులు తరచూ వెళ్తూ ఉంటారు. అలాగే వేణు స్వామి దంపతులు వెళ్లిన థాయిలాండ్ వెకేషన్ లోను కీర్తి రెడ్డి కనిపించింది. అలా వేణు స్వామికి ఎంతో సన్నిహితురాలైన కీర్తి రెడ్డి నా పై ఇలా మాట్లాడింది. అయితే ఆమె కావాలనే నన్ను ఇలా టార్గెట్ చేసింది. అంటూ ఆమె మాట్లాడిన కొన్ని ఆడియోలను మీడియా ముందు బయటపెట్టారు టీవీ ఫైవ్ మూర్తి.అంతేకాదు కేవలం వేణు స్వామిని అందులో నుండి బయట పడేయడం కోసమే వేణు స్వామి మంచి వాడని ఆమె ప్రచారం చేస్తుంది.

 అలాగే వీళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్ కూడా ఫేకే.. నేను అప్పుడే చెప్పాను. ఇందులో మాట్లాడింది ఎవరో ఆధారాలతో సహా బయట పెడతాను అని.. ఇప్పుడు అది చేసి చూపెట్టాను అంటూ కీర్తి రెడ్డి మాట్లాడిన వీడియో, ఆడియో బయటపెట్టారు మూర్తి. ఇక కీర్తి రెడ్డికి వేణు స్వామి ఎన్నో పూజలు చేశారట. అంతేకాదు కీర్తి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి గురించి మాట్లాడుతూ..నాకు వేణు స్వామి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ఆయన మంచివారు. నేను డిప్రెషన్ లో ఉన్న చాలాసార్లు నాకు ధైర్యం ఇచ్చారు అంటూ మాట్లాడింది. అలా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్న కీర్తి రెడ్డి నే ఇలా కావాలని నా గురించి దుష్ప్రచారం చేసింది అంటూ ఫైనల్ గా టీవీ ఫైవ్ మూర్తి ఆడియో కాల్ లో ఉన్నది ఎవరో బయట పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: