చిన్నప్పుడు రానా చదువుకునే రోజులలో లెక్కలు రాక ఇబ్బంది పడి లెక్కల పరీక్షలో 35 మార్క్స్ తెచ్చుకోవడం కూడ కష్టపడిన రానా తన సొంత అనుభవాన్ని ఒక సినిమా కథగా మార్చి కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిర్మింపబడ్డ ఈ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో నేచురల్ స్టార్ నాని రానా ల మధ్య కొనసాగుతున్న స్నేహాన్ని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అందరికీ తెలిసేలా చేసింది.
నివేదా థామస్ పిల్లల తల్లిగా ప్రధాన పాత్ర పోషించగా ప్రియదర్శి స్పెషల్ రోల్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ కోసం స్వయంగా రానా రంగంలోకి దిగడంతో ఈ మూవీ అందరికీ తెలిసేలా ఈమూవీ ఫంక్షన్ మరొకసారి సహాయ పడింది. నాని ఇండస్ట్రీకి వచ్చిన కొత్త రోజులలో నానీ కి రాణా పరిచయం అవ్వాడమే కాకుండా అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది.
ఈ సినిమా కథ తాను వినడమే కాకుండా రానా ఈసినిమా సక్సస్ పై పెట్టుకున్న ఆశలు పూర్తిగా నెరవేరుతాయని నాని అభిప్రాయ పడుతున్నాడు. ‘సరిపోదా శనివారం’ మూవీ కలక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో అంతగా మెప్పించలేకపోయినా రానా సలహాతో ఈమూవీలో నటించానని నాని అలనాటి విషయాలను ఇప్పుడు బయట పెట్టాడు. ఇదే సందర్భంలో రాణా మాట్లాడుతూ నాని పై పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు తాను ఇలా సింపుల్ గా మారిపోవడానికి నానీ కారణం అంటూ తన లానే నాని కూడ చిన్నతనంలో అతడి లెక్కల మాష్టారు బాధితుడు అంటూ జోక్ చేశాడు..