టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు. టెంపర్ సినిమా కంటే ముందు ఎక్కువ శాతం జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడికి ఆ ముందు సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం దక్కుతుందో ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేసి అపజయాలను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బోయపాటి శ్రీను , బాలకృష్ణ హీరోగా సింహ అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ ని రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దమ్ము అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత ఈ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ "రామయ్య వస్తావయ్య" అనే సినిమా చేశాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దూకుడు అనే మూవీ ని రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , శ్రీను వైట్ల దర్శకత్వంలో బాద్ షా అనే సినిమాను చేశాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: