టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ , ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు సూపర్ సాలిడ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. మిర్చి మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత కొరటాల శివ , రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

దానితో చరణ్ , కొరటాల శివ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా క్యాన్సల్ అయింది. అందుకు గల కారణాలను కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కొరటాల శివ ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... మిర్చి మూవీ తర్వాత చరణ్ తో మూవీ చేయాలి అనుకున్నాను. చరణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ మొదలు పెట్టాము. కాకపోతే ఎంత ప్రయత్నించినా కూడా కథ సెట్ కావడం లేదు. చాలా రోజుల పాటు కథ కోసం ప్రయత్నించిన అది సెట్ కాలేదు.  దానితో ఇక ఒక రోజు కథ సెట్ కావడం లేదు అని చరణ్ కు చెప్పాను. దానితో ఆయన మీకు మంచి కథ దొరికి అది హిట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సినిమా చేద్దాం.

అనవసరంగా సినిమా చేయడం మంచిది కాదు. మీకు వీలున్నప్పుడు సినిమా చేద్దాం అన్నాడు. అలా చరణ్ చెప్పడంతో నేను చరణ్ తో చేయాలి అనుకున్న సినిమా క్యాన్సిల్ అయింది అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొంత కాలం క్రితం కొరటాల , చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: