ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించే మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తాజాగా ఎలిమినేట్ అయిన అభయ్ నవీన్ గురించి ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. అయితే దానికి కారణం లేకపోలేదు! చాలా ట్విస్టుల మీద ట్విస్టులతో అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వేయబడ్డాడు.. కాదు కాదు.. బిగ్బాస్ అభయ్ నవీన్ ని మర్యాదపూర్వకంగానే బయటికి పంపించేశాడు అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. దాని వెనక బిగ్ బాస్ బడా బ్రెయిన్ దాగి ఉంది.

అభయ్ నవీన్ తనకున్న నోటి దురుసుతో ఏకంగా బిగ్ బాస్ పైనే సెటైర్లు వేశాడు. అవి సాధారణమైనవి కాదు... తిట్ల పురాణం కూడా అభయ్ అందుకున్నాడు. దాంతో పోస్ట్ నాగార్జున అభయ్ కి చీవాట్లు పెట్టి మరి రెడ్ కార్డ్ ఇచ్చేసాడు. కానీ తోటి కంటెస్టెంట్ బతిమలాడటంతో నాగార్జున క్షమించేసి హౌస్ లో ఉంచారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగా కాదు కదా... ఒక్కరోజు ముచ్చటగానే సాగింది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, శనివారం నాడే అభయ్ ని ఎలిమినేట్ చేసి ఉంటే, అభయ్ నవీన్ బయటికి వచ్చి.. హీరో లాగా ఫీల్ అయ్యి.. బిగ్ బాస్ నన్ను కావాలనే బయటికి పంపించేశాడు... లోపల గాని ఉంటే, నా అభిమానులు నాకు ఓట్లు ద్వారా గెలిపించేసేవారు! అని చెప్పుకునే వాడేమో? అవన్నీ ఆలోచించే బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేసి మరి అభయ్ నవీన్ ని బయటికి గెంటేశాడు... తక్కువ ఓట్లు వచ్చాయనే కారణాన్ని బయటికి చూపిస్తూ! దెబ్బ అదుర్స్ కదూ! అయితే బిగ్ బాస్ ప్లాన్ అర్థం కాని అభయ్ నవీన్ మాత్రం, తన అభిమానులు తనకి లాస్ట్ మినిట్ లో తక్కువ ఓటింగ్ చేశారని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడట. ఏది ఏమైనా అభయ నవీన్ బిగ్ బాస్ పైన అలా నోరు జారకుండా ఉండాల్సింది!

మరింత సమాచారం తెలుసుకోండి: