టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా , అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో ఎస్ కే సూర్య విలన్ పాత్రలో నటించగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొంత కాలం క్రితం ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది. అందులో ఈ సినిమా విడుదల తేదీని మెన్షన్ చేయలేదు. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల ఉంటుందా ..? లేదా అని అనుమానాలు మెగా అభిమానుల్లో రేకెత్తాయి. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగల్ అప్డేట్ వచ్చింది. ఇక ఈ సినిమాలోని సెకండ్ సింగల్ విడుదల సమయంలో అయినా ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటనను పోస్టర్ ద్వారా విడుదల చేస్తారేమో అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే ఈ సినిమా యొక్క రెండవ సాంగ్ రిలీజ్ లో కూడా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లయితే ఈ మూవీ డిసెంబర్ 20 వ తేదీన విడుదల కావడం కష్టమే అని అభిప్రాయానికి మెగా అభిమానులు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: