నటసింహం నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ కెరీర్లు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో భిన్నమైన పాత్రలు చేశారు. ఇక తన నటనతో కొన్ని పాత్రలతో నటరత్న ఎన్టీఆర్ నే బాలయ్య మెప్పించాడు అని చెప్పడంలోను ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి బాలయ్య కేరిర్‌లో ఆదిత్య 369 సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది.


మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా మన భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చింది. సీనియర్ విలక్షణా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో 1991 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. టాలీవుడ్ లోనే ఎవ్వర్‌ గ్రీన్ సినిమాలుగా చెప్పుకునే సినిమాలలో ఆదిత్య 369 కూడా ఒకటి.. మూడు డిఫరెంట్ టైం లైన్స్ లో ఈ సినిమా కథని దర్శకుడు చెప్పారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.


సినిమా తరవాత టైం ట్రావెల్ కొన్సెప్ట్ తో ఇండియాలో మరో సినిమా చేయడానికి ఎవరు సాహసించలేదు. బాలయ్య కి కూడా ఆదిత్య 369 అంటే  ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఎప్పుడో ఈ సినిమాకు తానే సీక్వెల్ చేస్తాని ప్రకటించాడు. ఇక దానికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా స్టోరీ ని కూడా బాలయ్య స్వయంగా రాసుకున్నాడు. తన దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కిస్తాను అనొ కూడా ప‌లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలానే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆదిత్య 999 సినిమాతో ఉంటుందని కూడా గతంలో పలు వార్తలు కూడా వచ్చాయి.


అయితే బాలయ్య హఠాత్తుగా ఆదిత్య 999 సినిమాను పక్కన పెట్టాడు. అదేవిధంగాా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతులవేదుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హనుమాన్ మూవీ లాగానే సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుంది. క్రమంలో ఈ సినిమా హిట్టు కొడితే ప్రశాంత్ వారంకు బాలయ్య మరో భారీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారట.


అదే ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా బాధితులని ప్రశాంత్ వర్మకు బాలయ్య అప్పగించే అవకాశం ఉందని.. ఇప్పటికే ప్రశాంత్ పరమే బాలయ్య మధ్య డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయని టాలీవుడ్ ఇన్సైడ్ టక్ అదే విధంగా బాలయ్య కెరీర్లో మరో ప్రత్యేకమైన సినిమా భైరవద్వీపం.. ఈ మూవీ సిక్వల్ ఛాన్స్ కూడా  ప్రశాంత్ కే ఇవ్వచ్చనే  టాక్ ఉంది. మరి మోక్షజ్ఞకి ప్రశాంత్ వర్మ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: