మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దేవరగా అడుగు పెట్టబోతున్నాడు. సోలో హీరో గా  దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత రావటంతో  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా దేవరపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.  రిలీజ్ కి ముందు రికార్డుల లిస్ట్ చూస్తే అవి కూడా గిన్నీస్ బుక్ లో చేరిపోయేలా ఉంది. ఏదో తమాషా రికార్డులా అంటే కాదు, హాలీవుడ్ జనం కూడా చర్చించుకునే స్థాయి సెన్సేషన్స్ ని విడుదలకు ముందే క్రియేట్ చేసింది. ఇంతవ‌ర‌కు ఎప్పుడు చేయని పనులు, జరగని వింతలు దేవర విషయంలోనే జరుగుతున్నాయి.


ఈ క్రమంలోనే దేవర తొలి రోజు కలెక్షన్స్ పై అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ బుకింగ్స్ అయిన దాన్ని బట్టి చూస్తే తొలి రోజు ఎన్టీఆర్ టాలీవుడ్ లో నయా రికార్డును క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు త్రిబుల్ ఆర్, బాహుబలి, కల్కి , సాహో  లాంటి సినిమాలు తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూలు సాధించాయి. ఇప్పుడు వాటన్నిటి రికార్డులను దేవర బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ పై కొత్త సంతకం చేయబోతుంది.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో దేవ‌ర‌ వస్తుంది.. అంతేకాకుండా శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుంది. ఎన్టీఆర్ తండ్రి కొడుకులు గా నటించగా..ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధా ఆర్ట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి. ఇక రిలీజ్ కి ముందే రెండు మిలియన్ డాలర్లు రాబట్టిన రికార్డు కూడా దేవరే సొంత చేసుకుంది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్స్ లో రోజుకి 7 షోలు పడేలా విడుదలౌతున్న తొలి భారతీయ సినిమా కూడా దేవరనే. అంతేకాదు ఇండియన్ మార్కెట్ లో మొదటి రోజు 200 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మరో వందకోట్లు మొత్తంగా 300 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయనే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా.ఇక దేవర కలెక్షన్లతో ఎన్టీఆర్‌ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: