- యూఎస్ లో ఇప్ప‌టికే ప్రీ సేల్స్ ద్వారా 2.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు
- మాస్ ర్యాంపేజ్ తో యూఎస్‌లో తార‌క్ ఊచ‌కోత‌
- ఎన్టీఆర్ నుంచి ఐదున్న‌రేళ్ల త‌ర్వాత వ‌స్తోన్న సోలో సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు
- ప్రీ సేల్స్ లో 75 వేల టిక్కెట్లు సేల్ అయ్యాయ‌ని డిస్ట్రిబ్యూట‌ర్ ప్ర‌క‌ట‌న‌


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చేస్తున్నాడు. మరికొద్ది గంటల్లో ‘ దేవర ’ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న‌ దండయాత్రకు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ కంప్లీట్‌ యాక్షన్ డ్రామా సినిమా ను దర్శకుడు కొరటాల శివ హైవోల్టేజ్ కంటెంట్‌తో తెరకెక్కించాడు. ఆచార్య లాంటి ప్లాప్ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చాలా క‌సితో ఎన్టీఆర్ తో ఈ భారీ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ దేవ‌ర‌ను తీశారు.


దేవ‌ర‌ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఓవ‌ర్సీస్ లో అయితే రిలీజ్ కు ప‌ది రోజుల ముందే ర్యాంపేజ్ దేవ‌ర చూపిస్తున్నాడు. ప్రీ-సేల్స్ రూపంలో దేవర 2 . 5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాడు. ఇదిలా ఉంటే దేవర ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో ఏకంగా 75వేల టికెట్లు అ మ్ముడు అయినట్లు యూఎస్‌ డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.


ఇలా ఐదున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తోన్న మాస్ సినిమా కావ‌డంతో పాటు ప్రీ సేల్స్ ఈ రేంజ్‌లో ఉండ‌డంతో దేవ‌ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ రేంజ్‌లో వండ‌ర్స్ క్రియేట్ చేస్తాడా ? అని అంద‌రూ ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. మిక్కిలినేని సుధాక‌ర్ - కొస‌రాజు హ‌రికృష్ణ నిర్మాత‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: