ఎన్టీఆర్ దేవర ఈ రోజున పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.. అయితే ఇప్పటికే దేవర సినిమా పైన కొంతమంది నెగటివ్ ,పాజిటివ్ టాక్ లను సైతం తెలియజేస్తూ ఉన్నారు. కానీ అసలైన టాక్ ఏంటన్న విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.. ఎన్టీఆర్ ఈసారి ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా పొలిటికల్ గా టచ్ లేకుండా సోలోగా దేవర సినిమాని పాన్ ఇండియా హైప్ తో రిలీజ్ చేశారు. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అభిమానులను అయితే మెప్పించింది. జాన్వీ కపూర్ మొదటిసారి తెలుగు సినిమాతో పాటు ఎన్టీఆర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చింది.


గత కొంతకాలంగా ఎన్టీఆర్ అభిమానులే కాకుండా నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టపడే వారందరూ కూడా ఎన్టీఆర్ సినిమాలను తెగ చూసేవారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల స్పందించలేదని విమర్శించారు..దీంతో చాలామంది నేతలు కూడా ఎన్టీఆర్ పైన విమర్శించడమే కాకుండా ఎన్టీఆర్ సినిమాలను చూడబోమంటూ కూడా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఎలాంటి విషయాలను లెక్కచేయకుండా ఎన్టీఆర్ తానంతటతానే సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం మా ఎన్టీఆర్ అన్నకు మేమున్నామంటూ అండగా నిలబడ్డారు.



దీంతో కావాలని కొంతమంది దేవర సినిమా పైన నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారనీ అభిమానుల సైతం వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న టాక్ తో కలెక్షన్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఎన్టీఆర్ స్టామినా ఏంటనీ అందరికీ ప్రూవ్ అవుతుంది.. లేకపోతే ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులలో లేకపోవడం వల్లే ఆయన క్రేజ్ తగ్గిందా అనే విధంగా కనిపిస్తుంది. అసలు ఏంటన్న విషయం మరో రెండు రోజులలో తెలియబోతుంది. మరి ఎన్టీఆర్ తన సత్తా చూపించే అవకాశం దేవర సినిమాపై ఆధారపడింది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: