ఈ మూవీ రిలీజ్ కు ముందే సెన్సేషనల్ రికార్డును దక్కించుకుంది ఫ్రీ బుకింగ్స్ కూడా సూపర్ గా జరిగాయి. దేవర సినిమాను అత్యధిక థియేటర్లో విడుదల చేసిన నేపథ్యంలో మొదటి రోజు వసూళ్లు కూడా రికార్డ్ బ్రేక్ చేయడం కన్ఫామ్ .. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ లో అన్నిటిలోనూ నేడు దేవర తప్ప మరి ఎ సినిమా ఆడే పరిస్థితి లేదు. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే ఈ ఒక్కరోజే ఏకంగా 42 షోలు వేయబోతున్నారు. ఇప్పటివరకు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒక్కరోజు ఏ సినిమాకి ఇన్ని షోలు పడింది లేదు. ఈ అరుదైన రికార్డును ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు.
ఇది మామూలు విషయం కాదు ఆల్ టైం రికార్డ్.. ఎన్టీఆర్ లైఫ్ లో ఇప్పటి వరకు అందుకొని స్పెషల్ రికార్డ్ అని చెప్పాలి. ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సైతం నమోదు కాబోతున్నాయి. కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ లోను దేవరజోరు ఇదే విధంగా కనిపిస్తుంది. ఒకే రోజు 42 షోల్ అంటే మామూలు విషయం కాదు. నిన్నటి వరకు 35లకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా హౌస్ఫుల్ అయిందట. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆ బ్యాలెన్స్ టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్స్ అయినా శని ఆదివారాల్లోనూ సినిమాకు ఇదే స్థాయిలో షోలు పడే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇదే విధంగా దేవర జోరు చూపిస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడటం ఖాయం. మొత్తానికి దేవర సినిమా రిజల్ట్ తో కొరటాలకు కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.