ఇక దేవర డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ భారీగానే ఖర్చు పెట్టింది. త్రిబుల్ ఆర్ ఓటిటిలో సాధించిన సంచలన రికార్డులను దేవర డిజిటల్ హక్కులకు డిమాండ్ ఏర్పడడానికి కారణమని చెప్పవచ్చు అందుతున్న సమాచారం మేరకు దేవర సినిమాకు నెట్ ఫ్లిక్స్ రూ.160 కోట్ల వరకు ఖర్చు చేసిందని టాక్.8 వారాలు తర్వాత ఓటీటీలో ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తుంది. ఇదే క్రమంలో నవంబర్ 20 తర్వాత దేవర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు కూడా వస్తున్నాయి.
ఇదే క్రమంలో దీపావళి కానుకగా దేవర ఓటిటిలో స్ట్రీమింగ్ కు రాబోతుందని కూడా కొందరు ఉంటున్నారు అక్టోబర్ 31 నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని కూడా అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ నూంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దేవర డే 1న్ కలెక్షన్లతో సెన్సేషన్ రికార్డులు సృష్టించబోతుంది. ఇప్పటికే ప్రీ సేల్స్ లోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే విధంగా పాజిటివ్ టాక్ కొనసాగితే దేవర లాంగ్ రన్ లో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాపడుతుందని కూడా అంటున్నారు.