వీరి తర్వాత మన మన తెలుగు రాష్ట్రాల నుంచి నటరత్న నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రిగా పని చేసి తనదైన రికార్డులను నెలకొల్పారు. అయితే ఇక్కడ మన చిత్ర పరిశ్రమలో తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా మారిన ఇద్దరు హీరోలతో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక హీరోకి అరుదైన ఘనత దక్కింది. ఆ హీరో ఆ ఇద్దరు ముఖ్యమంత్రిలతో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది. ఆ హీరో ఎవరు ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నిర్మించిన సినిమాలను నటించిన ఏకైక హీరో మరి ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.. ఈ అరుదైన ఘనత కృష్ణకేే దక్కింది. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీఆర్ స్నేహితుడిగా పేరుపొందున పి పద్మనాభన్, మక్కళ్ తిలగం పతకం పై తెలుగులో కృష్ణతో రెండు సినిమాలను తీశారు. అందులో మొదటి సినిమా షంషేర్ శంకర్.. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రానికి కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వం వహించగా.. ఇక ఈ సినిమాల కృష్ణ తన నటనతో అదరగొట్టాడు. అదే విధంగా కృష్ణ ఈ సినిమాలో మరోసారి మాయదారి మల్లిగాడు గెటప్ లో కనిపించి అభిమానులను అలరించాడు.
ఇక రెండో సినిమా విషయానికి తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా, ఎడిటర్ గా పనిచేసిన అమృతము దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా అమ్మాయికి మొగుడు మామకు అల్లుడు.. పంపు హర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకి మహారధి సంభాషణలు ఇచ్చారు. ఓ జమీందారీ కుటుంబం నేపథ్యంలో నడిచే సినిమా ఇది. ఈ సినిమాలోని జమీందారీ కోట కోసం మైసూర్ లోని లలితా మహల్ ప్యాలెస్ ను షూటింగ్ కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో వచ్చే ముఖ్యమైన సన్నివేశాలు అన్నీ బెంగళూరులోని తెర్కెక్కించారు. ఈ సినిమాలో కృష్ణకు జంటగా రజనీ శర్మ హీరోయిన్గా నటించింది. ఇలా ఈ రెండు సినిమాల ద్వారా కృష్ణ ఆ ఇద్దరి ముఖ్యమంత్రిలు నిర్మించిన సినిమాల్లో నటించిన అరుదైన ఘనతను తన కెరీర్‌లో అందుకున్నారు.