నట‌సింహం నందమూరి బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే ఐదు సినిమాల వస్తే వాటిలో నాలుగు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  ఇక వాటిలో రెండు ఇండస్ట్రీ హిట్లు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రమే ప్లాప్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు కూడా బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో సినిమా అంటే టాలీవుడ్‌లో  అంచనాలు మూలుగా లేవు.

ఇక ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఏకంగా ఆస్కార్ అవార్డు స్థాయికి తీసుకువెళ్లన గనత‌ రాజమౌళికే సొంతం. 20 సంవత్సరాల కెరీర్ లో ఒక అపజ‌యం అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే రాజమౌళి- బాలయ్య కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే రాజమౌళి శిష్యుడు ఇక్కడ బాల‌య్య‌తో సినిమా చేయటం విశేషం. అదేవిధంగా బాలయ్యకు ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చిన బి గోపాల్ శిష్యుడు అటు రాజమౌళి శిష్యుడు ఇద్దరు బాలయ్యతో తీసిన రెండు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి.
\
సీనియర్ దర్శకుడు బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన స్వర్ణ సుబ్బారావు బాలకృష్ణ హీరోగా విజయేంద్ర వర్మ సినిమాలు తెరకెక్కించాడు. 2003 ఫిబ్రవరి 23న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2004 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా సంగీత, లయ, అంకిత హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక అదే విధంగా రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ బాలయ్యతో 2009లో మిత్రుడు సినిమా చేశాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రియమ‌ని హీరోయిన్గా నటించింది.. ఈ సినిమా కథ  బాలయ్య ఇమేజ్కు తెగిన కథ కాదు. దీంతో ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు అగ్ర దర్శకులు శిష్యులతో బాలయ్య చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: