హీరో కార్తీ, అరవింద స్వామి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్ర సత్యం సుందరం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లాసికల్గా తెరకెక్కించడం జరిగింది. గతంలో 96 అనే క్లాసికల్ సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత మళ్లీ అదే రేంజ్ లో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ సత్యం సుందరం అనే సినిమాని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఏ విధంగా మెప్పించిందో చూడాలి.



స్టోరీ విషయానికి వస్తే.. సత్యం (అరవిందస్వామి) గుంటూరు దగ్గర ఉండే ఉంద్దడరాయుని పాలెంలో జీవిస్తూ ఉంటారు..ఈయనకి ఊరు అన్న, అక్కడ ఉన్న పొలాలు తన తాత ఇల్లు అంటే చాలా ఇష్టము.. అయితే కొంతమంది బంధువులు మోసం చేయడం వల్ల.. చిన్న వయసులోనే ఆ ఇంటిని కోల్పోతారట. దీంతో అలా తన సొంత ఊరుని వదిలేసి వైజాగ్ వెళ్లి స్థిర పడిపోతారట. ఈ క్రమంలోనే 30 ఏళ్లు సత్యం కు వచ్చేస్తాయట. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా సత్యం కు తన ఊరు తన ఇంటి జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. అలా ఒకసారి తన బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు తప్పని పరిస్థితులలో తన సొంత ఊరు ఉంద్దడరాయుని పాలెంలో ఉండాల్సి వచ్చిందట. ఆ పెళ్లిలోనే బావ అంటూ ఒక వ్యక్తి పలకరిస్తాడు (కార్తీ).. ఆ తర్వాత అతని ఎవరు తన పేరు ఏంటన్నది. సత్యం గుర్తుపట్టకపోయినా.. పలకరిస్తూ ఉంటారు అలా వీరిద్దరి మధ్య ఆప్యాయత ప్రేమాభిమానాలు  అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తాయి. బావ అని పిలిచిన వ్యక్తి సత్యం కి మధ్య బంధం ఏంటి అనేకథంశంతో తీశారు.


సినిమా చూసిన నెటిజెన్స్..ఇలాంటి సెన్సిబుల్ కథను తీసుకురావడం చాలా కష్టమని కానీ ఈ పాయింట్ చాలామందిని ఎమోషనల్ గా టచ్ చేస్తుందని కొన్నిసార్లు కంటతడి పెట్టించేలా చేస్తాయని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇందులోని పాత్రలు నసగా కూడా అనిపిస్తాయట. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాలలో కనిపిస్తూ ఉంటాయనీ తెలియజేస్తున్నారు.


అయితే మరొక నేటిజన్ ప్రస్తుతం ఆడియన్స్ అందరూ కూడా కేజీఎఫ్, సలార్, పుష్ప, దేవర వంటి యాక్షన్ సన్నివేశాలలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సెన్స్బుల్ స్టోరీ అంటే తెలుగు ఆడియోస్ కి ఎక్కడం కష్టమంటూ తెలియజేస్తున్నారు. మరి కార్తీ సినిమా పూర్తి రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: