మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. యావరేజ్ టాక్ తోనే భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చిందంటూ చిత్ర బంధం అధికారం గా ప్రకటించింది. అయితే కలెక్షన్లు చెప్పే బాక్స్ ఆఫీస్ పోర్టల్స్ కొన్నిరూ. 140 కోట్లు మాత్రమే వచ్చేయని తెలిపారు. ఈ రెండు నెంబర్స్ లో ఏది నిజమనేది పక్కన పెడితే ఎన్టీఆర్ సత్తా ఏమిటి అనేది మరోసారి బాక్సాఫీస్ పై చూపించాడు. మిక్స్డ్ టాక్‌ ఇంకా చెప్పాలంటే సినిమా గొప్పగా ఏమీ లేవంటూ రివ్యూలు అయినా మొదటి రోజే రూ.150 కోట్లకు పైకి వసూళ్లూ సాధించాడు. రెండో రోజు కూడా దేవర‌కు రికార్డు స్థాయిలో కలెక్షన్ వచ్చాయంటే ఎన్టీఆర్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.


రెండు రోజుల కలెక్షన్ కలిపి దేవర 250 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల దేవర వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రూ.200 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు సైతం చెప్పాయి. మొదటి రోజు రూ.140 కోట్లు గ్రాస్ గా చెప్పగా.. రెండో రోజు రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు వ‌చ్చాయిని చెప్పాయి. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమాకు మొత్తంగా 220 కోట్ల గ్రాస్‌  వచ్చినట్లు అయింది.

తొలి రోజు దేవరకు నార్త్ ఇండియాలో భారీ హైప్ రాలేదని కొంతమంది అన్నారు.. సినిమా ఓపెనింగ్ స్లోగా ఉంది.. అయితే సినిమాకు నెమ్మదిగా ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఈ సినిమాకు హిందీ వెర్షన్ నుంచి రూ. 7కొట్లు రూపాయలు నెట్ కలెక్షన్ రాగా రెండో రోజు రూ.10 కోట్లకు పైగా వచ్చింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్య సరికి దేవర హిందీలో 30 కోట్లకు పైగా కలెక్షన్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ ఎవరేజ్ టాక్ తోనే అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: