రాజమౌళి సెంటిమెంటును కూడా ఎన్టీఆర్ బద్దలు కొట్టాడని చెప్పాలి. రాజమౌళితో చేసిన తర్వాత ఏ సినిమా అయినా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడా నేటివ్ టాక్ మాత్రం తెచ్చుకోలేదు. కొందరికి మొదటి భాగం నచ్చితే మరికొందరికి కొండో భాగం నచ్చింది. కొందరు మాత్రం సినిమా నచ్చలేదంటే మరికొందరు మాత్రం పరవాలేదు సినిమా చూడచ్చు అంటున్నారు ఇవన్నీ ఇలా ఉంటే దేవర కలెక్షన్లు చూస్తుంటే అందరికీ మతిపోతుంది ఎన్టీఆర్ క్రేజీ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
గతంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది ఆ సినిమాకు కూడా మిక్స్‌డ్ టాక్ నే తెచ్చుకుని తర్వాత వరుస సెలవులు కలిసి రావటంతో నెమ్మదిగా పుంజుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరిగ్గా ఇప్పుడు దేవరకు కూడా ఇలాగే అవుతుందని కూడా అభిమానులు అంటున్నారు. ఇక్కడ కలిసివచ్చే పాయింట్ ఏమిటంటే స్టూడెంట్ నెంబర్ వన్ కు మిక్స్ డ్ టాక్ వచ్చిందికానీ దేవరకు ఎక్కడా నెగెటివ్ టాక్ రాలేదని గుర్తుచేస్తున్నారు. విజయదశమి వరకు ఏ సినిమా కూడా విడుదలవడంలేదు కాబట్టి ఈ సినిమాకు అప్పటివరకు తిరుగులేదంటున్నారు. నెమ్మదిగా పుంజుకొని కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు తరలివస్తారని, సినిమా వెయ్యికోట్ల రూపాయల వసూళ్లవైపు పరుగులు తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.