ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది దర్శక నిర్మాతలు వాళ్ళ సినిమా బిజినెస్ అవ్వడానికి ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటారు.. మరి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఏది నిజమనేది ఎవరికీ తెలియదు. కాబట్టి సినిమా విడుదలై సూపర్ హిట్ అయితేనే అప్పుడు ఆ హీరోకి దర్శకుడు కి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు పుష్ప మొదటి పార్ట్ లో బైరవసింగ్ షెకావత్ గా నటించిన ఫాహద్ ఫజిల్ సెకండ్ పార్ట్ లో కూడా విలన్ గా నటించడానికి రెడీ అయ్యాడు.
ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆయన చాలావరకు అసంతృప్తిగా ఉన్నాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు కారణం ఏంటి అంటే తనకు సుకుమార్ మొదట కథ చెప్పినప్పుడు తన క్యారెక్టర్ ఎంతో ఎలివేట్ అవుతుందని మాట ఇచ్చారట. అయితే మొదటి భాగంలో ఆయన క్లైమాక్స్‌లో కొంతవరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఆయన క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆయనకి సుకుమార్ పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఫాహాద్ ఫజిల్ పాత్రను తగ్గించి స్టోరీని కొంచెం చేంజ్ చేసి సుకుమార్ కొత్తగా రాసుకున్నారట. దీంతో ఫాహాద్ మూవీ మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి.
కారణం ఏదైనా కూడా సినిమా సక్సెస్ వల్ల సుకుమార్ కి పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ వచ్చి పడింది. అలాగే ఫాహాద్ ఫజిల్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి పుష్ప సినిమాకి ఓకే చెప్పాడు.. మరి అలాంటి సందర్భంలో ఆయన చేసే పాత్ర వ్యాల్యూ లేనప్పుడు ఆయన క్రేజ్ కూడా పడిపోయే అవకాశం ఉంది. దీంతో సహాసుకుమార్ కు ఫాహాద్ ఫజిల్ త్వరలోనే గట్టు షాక్ ఇవ్వబోతున్నాడని టాక్ కూడా ఉంది.