టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా..సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే మహేష్ చెల్లి పద్మ ప్రియదర్శిని సుదీర్ బాబు పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి పెళ్లి కృష్ణ ఘనంగా జరిపించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నటులతో పాటు రాజకీయ ప్రముఖులు మొత్తం ఈ పెళ్లికి హాజరయ్యారు. తాజాగా సుధీర్ బాబు తన పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇక తన పెళ్లి వీడియోని కట్ చేసి సుదీర్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అది కొద్ది నిమిషాలోనే ఎంతో వైరల్ గాా మారింది. ఆ వీడియోలో మహేష్ బాబు వారిద్దరినీ ఆశీర్వదించడం కృష్ణ కుటుంబం మొత్తం కనిపించడంతో మహేష్ అభిమానులు ఆ వీడియోని షేర్లు చేయడం మొదలుపెట్టారు. ఇక సుధీర్ బాబు త్వరలోనే మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో పరీక్షలు ముందుకు రాబోతున్నాడు ఈ క్రమంలోని ఆ సినిమా నుంచి ఓ మ్యారేజ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ మూవీ పాటకి తన పెళ్లి వీడియోని అటాచ్ చేసి సుదీర్ ఆ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.


ఇక మరి సుధీర్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సుధీర్ బాబు నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి వేడుకలో ఉన్నది కాలం వేదిక ఈ కళ్యాణం అనే పెళ్లి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు తన పెళ్లి వీడియోను జత చేసి ఇలా సినిమా ప్రమోషన్లలో భాగంగా షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: