దేవర సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తోంది, కాసుల వర్షం కురిపిస్తుంది. ఇందులో తారక్ నటనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని మరో లెవల్లో ఎలివేట్ చేసింది. అందుకే అతన్ని ఒక దేవుడి లాగా కొలుస్తున్నారు. నిజం చెప్పాలంటే అనిరుధ్ రవిచందర్ "అరవింద సమేత వీర రాఘవ" చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో తమన్ వచ్చారు.

అయితే, ఈ విషయంలో నిరాశ చెందిన అభిమానులు ఇద్దరు కలిసి ఎప్పుడు పని చేస్తారా అని చాలా కాలంగా ఎదురు చూశారు. చివరకు దేవర చిత్రంతో అది జరిగింది. అనిరుధ్ ఎన్టీఆర్ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఈ చిత్రానికి ఒక పర్ఫెక్ట్ ఆడియో ఆల్బమ్, పవర్ ఫుల్ మ్యూజిక్ స్కోర్‌ను అందించడం ద్వారా వారి అంచనాలను అందుకున్నారు.

దేవర సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రావడానికి అనిరుధ్ సంగీతం ఒక కారణం. అనిరుధ్ సినిమాలోని ప్రతి పాటకి ప్రాణం పోశాడు. అంతేకాకుండా, సినిమా మొత్తం ఇంకా బాగా ఎలివేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించాడు. ఎన్టీఆర్ ఇంతకు ముందు మాస్ సినిమాలు చేసినా, ఈ సినిమాలో అనిరుధ్ సంగీతం వల్ల చాలా ఫ్రెష్‌గా కనిపించాడు. అనిరుధ్ ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్ల కోసం అనిరుధ్ ఇంతకు ముందు తెలుగులో చేసిన సినిమాల కంటే ఇంకా బాగా చేశాడు.

ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా "చుట్టమ్మలే" పాట సినిమా విడుదలైన రోజునే థియేటర్లని కచేరీ హాల్ లా మార్చేసింది. అనిరుధ్ ఇంతలా ప్రశంసలు అందుకోవడానికి చాలా కాలమైంది. దేవర సెకండ్ పార్ట్ కూడా అంచనాలను అందుకుంటే, తెలుగు సినిమాల్లో అనిరుధ్ చాలా పెద్ద మార్పు తీసుకువస్తారు. అనిరుధ్ ఏ సినిమా చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. 'దేవర' సినిమా అతని క్రేజ్ మరింత పెంచేసింది. తన సంగీతంతో అభిమానులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ అనిరుధ్ రవిచందర్ ని దేవుడు అంటూ తెగ పొగిడేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: