టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శైలేష్ కొలను ఒకరు. ఈయన నాని నిర్మించిన హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో యువ నటుడు విశ్వక్ సేన్ హీరో గా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు తెలుగు లో మంచి విజయం సాధించిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ని హిందీ లో అదే టైటిల్ తో వేరే హీరోతో రీమేక్ చేశాడు. ఈ మూవీ ని నాని నిర్మించలేదు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆ తర్వాత ఈ దర్శకుడు నాని నిర్మించిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అడవి శేషు హీరో గా నటించగా ... మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత శైలేష్ కొలను , విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా సైంధవ్ అనే సినిమాను తెరకెక్కించాడు.

మూవీ కి నాని నిర్మాతగా వ్యవహరించలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా నాని నిర్మించిన సినిమాలతో మాత్రమే శైలేష్ ఇప్పటి వరకు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు నాని హీరో గా నటిస్తూ , నిర్మిస్తున్న హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఈ యువ దర్శకుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: