చిత్ర పరిశ్రమలో సాధారణంగా స్టార్ హీరోలు ప్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వాలంటే భయపడతారు.. అలాగే ఆ డైరెక్టర్ తో సినిమా అంటే ఒక ఎంత రిస్క్ అని భావిస్తారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. ఆ డైరెక్టర్ లో ఏదో విషయం ఉంది ఫ్లాప్ అయిన పర్వాలేదు సినిమాను తీస్తాను అని ముందుకు వస్తారు. అందరు హీరోలు పక్కన పెట్టినా కూడా ఎన్టీఆర్ ఆ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.

అయితే గత పదేళ్లలో ఐదుగురు ప్లాప్ డైరెక్టర్లకు హిట్లు ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ఇంతకీ ఆ డైరెక్టర్స్‌ ఎవరు అనే సంగతులు ఇక్కడ చూద్దాం. ముందుగా పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఎన్టీఆర్ ఈ సినిమాకు ముందు పూరి  ఖాతాలో పెద్దగా హిట్లు లేవు. ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడంతో పూరి మరోసారి తనెంటు ప్రూవ్ చేసుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర టెంపర్ బంపర్ హిట్ గా నిలవడంతో పాటు రికార్డు కలెక్షన్లు సాధించింది.

ఇక వన్ నేనొక్కడినే సినిమాతో భారీ  భారీ ప్లాప్ ను దక్కించుకున్న సుకుమార్ కు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఆ సినిమా దగ్గర నుంచి సుకుమార్ పాన్ ఇండియా దర్శకుడుగా ఎదిగాడు. అదేవిధంగా పవన్‌తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లాంటి భారీ ప్లాప్ అందుకున్న బాబికి జై లవకుశ సినిమాతో బంపర్ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్. అదేవిధంగా అజ్ఞాతవాసి సినిమాతో భారీ ప్లాప్‌ను తన ఖాత‌లో వేసుకున్న త్రిపవిక్రమ్ కు అరవింద్ సమేత వీర రాఘవతో భాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపాడు. ఇక ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివకు దేవర సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు. ఇలా తన ప‌ది సంవత్సరాల కెరియర్లో ఐదుగురు పైగా ప్లాప్ డైరెక్టర్లకు సూపర్  హిట్‌లు ఇచ్చాడు. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వార్ 2 సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా ప్రశాంత్ నీల్ తోనూ, అలాగే త్రివిక్రమ్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: