అ సమయంలో ఎక్కడ చూసినా వర్షం మూవీ పాటలే వినిపించేవి దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 2004 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ గురించి ప్రభాస్ గతంలో అన్ స్టాపబుల్ షో లో బాలయ్యతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్షం మూవీని ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజుగారు సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాతో అన్నారు.. అప్పటికే మీరు నటించిన లక్ష్మీనరసింహ మెగాస్టార్ అంజి చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
దీంతో నేను రాజు గారితో చిరు- బాలయ్య మధ్యలో మన సినిమా వద్దు సార్ తర్వాత చూసుకుందాం అనిన చెప్పా. ఆయన వినుకొండ లేదు మనం రిలీజ్ చేయాల్సిందని అన్నారు. వెంటనే బాలయ్య మాట్లాడుతూ మీరు రాజులు కాద ఎవరి మాటా వినరంటూ సరదాగా పంచ్ వేశాడు. అలా మొత్తానికి వర్షం మూవీ రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టావు కదా అని బాలయ్య ప్రశంసించాడు. తనకి దక్కిన తొలి బ్లాక్ బస్టర్ వర్షం అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. వర్షం సినిమాతో ప్రభాస్- గోపీచంద్ మంచి స్నేహితులగా మారారు. త్రిష కెరియర్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. అలా ప్రభాస్ కెరియర్ లో వర్షం మూవీ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో పాటు విడుదలైన బాలయ్య లక్ష్మీనరసింహ సూపర్ హిట్గా నిలవగా చిరు అంజి సినిమాా ప్లాప్‌గా మిగిలిపోయింది. అలా కెరీర్ మొదట్లోనే చిరు- బాలయ్యకు చెమటలు పట్టించాడు.