ఒకేసారి సావిత్రికి భర్తగా- కొడుకుగా నటించిన ఏకైక హీరో ఎవరు అంటే..!
మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుగు- తమిళ భాషలో ఆమె తిరుగులేని క్రేజ్‌ను తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ -ఏఎన్నార్‌లను మించిన గౌరవం కీర్తి సావిత్రి అందుకున్నారు. ఒకానొక సమయంలో వారిద్దరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ సావిత్రి అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక సావిత్రితో నటించాలని చాలామంది హీరోలు కోరుకునేవారు. ఆమెతో కలిసి నటించాలని అదృష్టం కోసం ఎదురుచూసేవారు. ఆ అవకాశం కొంతమంది నటులకు మాత్రమే వచ్చింది.
విచిత్రమైన కాంబినేషన్స్:
నేటితరం హీరోలు రెండు మూడు సంవత్సరాలకు గాను ఒక సినిమా చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఏడాదికి ఒక్కో హీరో 20 -30 సినిమాల్లో నటించేవారు. మూడు షిఫ్టులో నిరంతరం పనిచేసే వారు అప్పట్లో షూటింగ్ కి విదేశాలకు వెళ్ళటం భారీ సెట్టింగ్స్ విజువల్ ఎఫెక్ట్ ఉండేవి కాదు. తెలుగు సినిమాల్లో దాదాపు తెలుగు నటులే నటించేవారు లేదంటే తమిళనాడు నటులు కీలకపాత్రలో నటించేవారు.
కాంబినేషన్స్ రిపీటెడ్ గా అవుతూ ఉండేవి.. ఒక్క సినిమాలో చెల్లిగా నటించిన వారు మరో సినిమాలో అదే హీరో పక్కన హీరోయిన్గా చేసే ఇలాంటి విచిత్రమైన కాంబినేషన్స్ అప్పట్లో ఎన్నో చోటు చేసుకునేవి. నేటితరం హీరోలు ఒక హీరోయిన్ తో రెండు సినిమాలు చేయటమే ఎక్కువ అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌కు మనవరాలుగా చేసిన శ్రీదేవి పెద్దయ్యక ఆయనతో కలిసి హీరోయిన్గా కూడా ఆడింది. అలాగే ఎన్టీఆర్‌కు భార్యగా నటించిన అంజలిదేవి తరవాత ఆయనకు తల్లిగా కూడా నటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంబినేషన్స్ ఎన్నో ఉన్నాయి.
ఇక వీటన్నిటికీ మించిన స్పెషల్ కాంబినేషన్ సావిత్రి విషయంలో జరిగింది. సీనియర్ నటుడు గిరిబాబు సావిత్రికి భర్తగా కొడుకుగా నటించారు. అది కూడా ఒకే సమయంలో.. 1973లో గిరిబాబు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు తన తొలి మూవీ జగమే మాయ.. అదే సంవత్సరం జ్యోతిలక్ష్మి టైటిల్ తో వచ్చిన చిత్రంలో సావిత్రికి భర్తగా నటించే అవకాశం గిరిబాబుకు దక్కింది. అలాగే అనగనగా ఓ తండ్రి మూవీలో గిరిబాబు సావిత్రి కొడుకా కూడా నటించాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లో కూడా ఒకే సమయంలో జరిగాయట. గిరిబాబు మధ్యాహ్నం వరకు జ్యోతిలక్ష్మి షూటింగ్లో సావిత్రికి భర్తగా ఉంటూ తర్వాత అనగనగా ఓ తండ్రి సినిమాలో ఆమెకు కొడుకుగా నటించేవారట. ఇది ఎంతో అరుదైన విషయం అయనకెరీర్ ఆరంభంలోనే గిరిబాబు మహానటితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం ఇప్పటికీ అదృష్టంగా భావిస్తున్నారట.