తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. విజయ్ ఈ మధ్య కాలంలో ఒక డిఫరెంట్ ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నాడు. అలాగే ఆ మూవీ లతో మంచి సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు. అసలు ఆ ఫార్ములా ఏమిటో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు తలపతి విజయ్ నటించిన సినిమాలలో యంగ్ బ్యూటీలే హీరోయిన్లుగా కనిపిస్తూ ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఈ విషయంలో విజయ్ చాలా వరకు వెనక్కు తగ్గినట్లు తెలిసిపోతుంది. ఎందుకు అంటే గత కొద్ది కాలంగా ఈయన నటించిన సినిమాలలో సీనియర్ హీరోయిన్లే కనబడుతూ వస్తున్నారు.

కొంత కాలం క్రితం విజయ్ "లియో" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ జంటకు కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా విజయ్ "ది గోట్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. అందులో ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ విజయ్ నటించాడు. ఇక తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ స్నేహ నటించింది. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయిన తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే విజయ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇక రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చే ముందు తలపతి విజయ్సినిమా చేయబోతున్నాడు. అది ఆయన కెరియర్లో 69 మూవీగా రూపొందబోతుంది. తాజాగా ఈ మూవీ లో నటించబోయే నటీనటుల లిస్టును మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రియమణి నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో లియో , గోట్ ఫార్ములాను మరోసారి తలపతి 69 మూవీ తో విజయ్ ఫాలో కాబోతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: