* ఏఎన్‌ఆర్‌ వారసుడిగా నాగార్జున ఎంట్రీ
* 65 ఏళ్లు ఉన్నా..ఇంకా మన్మథుడే
* యంగ్‌ హీరోలతో పోటీ పడుతున్న నాగార్జున
* స్టైల్‌, గ్లామర్‌ కు పెట్టింది పేరు


టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది  హీరోలు ఉన్నారు.  అందులో కొంతమంది కష్టపడి ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుంటే... మరి కొంతమంది... వారసత్వాన్ని అందిపుచ్చుకొని సక్సెస్ అవుతున్నారు. అలా వారసత్వం ద్వారా... ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు... కొడుకుగా ఇండస్ట్రీలో... అడుగుపెట్టారు అక్కినేని నాగార్జున.


అయితే అక్కినేని నాగార్జున చాలా సినిమాలు చేశారు. 1989 నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఆ సమయంలో గీతాంజలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున సినిమా అనగానే అందరికీ... ఆయన గ్లామర్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే టాలీవుడ్ మన్మధుడిగా... అక్కినేని నాగార్జున పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏ సినిమా చేసిన... చాలా హ్యాండ్సం లుక్ లో కనిపిస్తారు.


ఆయన ఏజ్ 65 ఏళ్లు దాటిన.. కూడా యంగ్ హీరోల కనిపిస్తారు మన్మధుడు నాగార్జున. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల సరసన అక్కినేని నాగార్జున నటించిన... అందరినీ ఆకట్టుకున్నారు. అయితే అక్కినేని నాగార్జున సినిమాలో పెద్దగా డాన్సులు ఉండకపోవచ్చు. కానీ ఆయన స్టైల్, గ్లామర్, డ్రెస్సింగ్ స్టైల్... హెయిర్ స్టైల్...  ఇలా అనేక రకాలు మనకు కనిపిస్తాయి. ఆయన ప్రతి సినిమాలో ఇవి కచ్చితంగా ఉంటాయి.


అయితే ఆయన సినిమా చూసిన తర్వాత... జనాలు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఆయన లాగే గ్లామర్ గా ఉండాలని... ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ... ఆయన యంగ్ హీరోలా కనిపిస్తారు. నాగార్జున... తో పాటు కెరీర్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, బాలయ్య బాబు అందరూ ఏజ్ అయిపోయిన వారి లాగానే కనిపిస్తారు. కానీ నాగార్జున మాత్రం.. ఎప్పటికీ ఇండస్ట్రీలో మన్మధుడే.

మరింత సమాచారం తెలుసుకోండి: